యాధృచ్చికంగా ఒకనాడు మేమిద్దరం కలిసి బ్లాగ్ మొదలెట్టాలి అనుకున్నాక, పేరు దగ్గరి నుండి టెంప్లేట్ దాకా.. ఏం రాయాలి దగ్గరినుండి ఎలా రాయాలి దాకా.. చర్చించుకోవటం చాలా ఉత్సాహంగా ఉండేది. టెక్నికల్ విషయాలనుండి ఇమేజ్ సెలక్షన్, క్రియేషన్... ఇలా పనులన్నీటినీ మా సమయానుకూలతని బట్టి ఇద్దరమూ సమన్వయించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మేం రాసే ప్రతీ పోస్ట్ కూడా బ్లాగుల్లో రచనలకి సంబంధించినది అయ్యుండాలనే మా మొదటి సూత్రాన్ని ఎప్పటికప్పుడు గుర్తెరిగి దానికి అనుగుణంగానే ఈ బ్లాగులో పోస్టులు ఉండేలా చూసుకుంటున్నాం.
ఒకానొక రోజు మాటల సందర్భంలో అనుకోకుండా ఈ-బుక్ ప్రస్తావన మా మధ్య రావటం, అమలు పరచటం వెనువెంటనే జరిగిపోయాయి. ఈ మొత్తం పుస్తకం రూపకల్పనలో ఎక్కువ కష్టపడింది మాత్రం మధుర అనే చెప్పాలి. అందరి పోస్టులూ డాక్యుమెంట్ చేయడం, ఫార్మాటింగులూ గట్రా చూస్కోవడం.. అవన్నీ తనే చేసింది. నేను కాస్త బిజీగా ఉండటం వల్ల మరింత సమయం ఈ పుస్తకం కోసం కేటాయించలేకపోయినప్పటికీ పాపం విసుక్కోకుండా ఓపిగ్గా తనే అన్నీ నెట్టుకొచ్చింది.
ఈ పుస్తకం కోసం పోస్ట్ లను ఎన్నుకోడం, రాసిన వారి నుండి అనుమతులు తీసుకోడం, వాటన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా కూర్చటం... మాటల్లో చెప్పడానికి మూడు ముక్కలుగా అయిపోయినా... ఇదంతా చేతల్లో చూపడానికి ఎంత శ్రమ, ఎంత సమయం, ఎంత ఓర్పు అవసరమో మాకు స్వీయానుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం కూర్చే క్రమంలో మాకు సహకరించిన, మమ్మల్ని ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
ప్రకటించిన తేదికి ఎటువంటి వాయిదాలు వెయ్యకుండా విజయవంతంగా ఈ పుస్తకాన్ని విడుదల చెయ్యాలని మా ఇద్దరి కోరిక. ఎట్టకేలకు మేము అనుకున్న విధంగా నూతన సంవత్సరం ఏతెంచే సమయానికి 'నూతన సంవత్సరాగమనం' అనే మన తెలుగు బ్లాగర్ల రచనా సంకలనాన్ని e-పుస్తకం రూపంలో మీ అందరి ముందుకి తీసుకొచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మీరందరూ వీలు చేసుకుని ఈ పుస్తకాన్ని చూసి, చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తే మరింత సంతోషంగా ఉంటుంది. విలువైన మీ స్పందన కోసం ఎదురు చూస్తాం.
ఈ e-పుస్తకాన్ని ఎవరైనా ఉచితంగా ఇక్కడ నుండి లేదా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
21 comments:
e-పుస్తకాన్ని మీరు అనుకున్న సమయానికి తీసుకువచ్చినందుకు ముందుగా మీ ఇద్దరికి అభినందనలు.
పుస్తకం చదివాక మరలా నా అభిప్రాయాన్ని తెలియచేస్తాను.
వచ్చే సంవత్సరంలో మీరు ఇలాంటివి మరిన్ని చెయ్యాలని కోరుకుంటూ
అభినందనలతో
Just downloaded and flipped thru it. Nice effort. Kudos to a job well done :-)
చూడ చక్కగా మలచారు ఈ బుక్ ను.. ఇంత శ్రమ తీసుకుని అనుకున్న సమయానికి ప్రచురించిన మీ ఇరువురికి అభినందనలు ప్లస్ ధన్యవాదాలు :)
wow this is amazing...hats off to you guys!
మీరు తోటి బ్లాగర్ల పట్ల చూపిన ప్రేమ అమోఘం, అజరామరం.
సుజన, మధురవాణి... ఇద్దరికీ అభినందనలు. ఇంత అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు..
great job excellent
great effort
చాలా బాగుంది . నా పోస్ట్ ఇ. బుక్ లో చూడగానే చెప్పలేనంత సంతోషమేసింది . థాంక్ యు .
అభినందనలు .
గ్రేట్..... మీ ప్రయత్నం చాలా బాగుందండి. చాలాబాగా చేశారు పుస్తకాన్ని. మీ మిగతా ప్రయత్నాలు కూడా ఇలాగే విజయవంతమవ్వాలని కోరుకుంటున్నాను.
సుజ్జీ, మధురా! అబ్భ, ఎన్ని కోణాలు ఆ ఒక్కరోజుకి. నిజం చెప్పాలంటే ఇంత వైవిధ్యం - ఉగాది ముగ్గులనుండీ కాలేజీ కబుర్లవరకూ, చిన్న చిన్న హాస్యాలనుండీ గంభీరమైన ఆలోచనలవరకూ - ఉండగలదని నేనూహించలేదు. దీనివెనక ఎంత కృషి ఉందో ఇవన్నీ చదివితే కానీ తెలీదు.
మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలూ, 2011 శుభాకాంక్షలు - మాలతి
సుజన గారు, మధుర గారు ధన్యవాదాలు. ఎన్నో చక్కటి రచనలను కూడా చదవగలిగాను. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సృజన , మధుర అబినందనలు . ఎంతో శ్రమకోర్చి మీరు మాకిచ్చిన ఈ బహుమతికి ధన్యవాదాలు
Very nice compilation...
నూతన సంవత్సర శుభాకాంక్షలండి.పుస్తకం బాగుందండి.
Nice thought
మీ ఇరువురికి అభినందనలు ప్లస్ ధన్యవాదాలు :)
చాలా బాగుంది . నా పోస్ట్ ఇ. బుక్ లో చూడగానే చెప్పలేనంత సంతోషమేసింది . థాంక్ యు .
పైన వారందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
గీ పుస్కం ఎందుకొ తెర్సుకుంటలేదు...జెర ఎట్ల తెర్వాల్నొ ఏందో ఎవులైన చెప్తరా?
I needed to thanks for this great read!! I undoubtedly enjoying each little little bit of it I have you bookmarked to check out new stuff you publish
meku dnayvadamulu
Post a Comment