స్నేహితులు దొరకటం అదృష్టమా? కష్టమా? విధి విపరీతమా?
ఇప్పటి వరకు తారసపడ్డ ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధం గా నా బుర్రకు జ్ఞాన దీపాలు వెలిగించినవారే.

గంగి గోవు పాలు చందాన .. మనసు తెలిసిన స్నేహం ఒకటైనా చాలు అనుకున్నప్పుడు గుర్తుకొచ్చే వారిలో మధురవాణి ఉండేది ముందు వరసే !!

స్నేహం విలువలు అని ఉపన్యాసం దంచలేను కానీ, స్నేహితుల దినోత్సవం సందర్భంగా తనకు శుభాకాంక్షలు సుజనమధురం గా చెప్పాలనుకున్నాను.

మా గొప్ప పనిమంతురాలైన మధురవాణి ఇంకో ఇరవై రోజుల్లో పెళ్ళికూతురు కాబోతుంది కూడాను.
కనుక.. తనకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.!!


కొసమెరుపు: సొంతం గా నాలుగు మాటలు రాయటం ఎంత కష్టమో కదా!
అయినా ఈ నెల తో బ్లాగటం మొదలెట్టి రెండేళ్ళు నిండినందుకు నాకు కూడా చపట్లు !!
