సాధారణంగా ఎవరు బ్లాగ్ రాసినా.. దాని వెనుక తమ అభిప్రాయాలు, ఆలోచనలు నలుగురితో పంచుకోవాలనే ఉద్దేశ్యమే ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏ విషయం గురించి రాస్తున్నారనేది వారి వారి అభిరుచిని బట్టి మారవచ్చు. ఏదైనా ఒక విషయం పట్ల విస్త్రృతమైన అవగాహన, పరిజ్ఞానం ఉండి, దాన్నిసులభతరమైన రీతిలో మరో నలుగురికి చేరువగా చేసేందుకు బ్లాగును వేదికగా చేసుకోవడమనేది చాలా అరుదుగా జరిగే విషయం.
ఇప్పుడు మేము చెప్పబోయేది పైన చెప్పిన లక్షణాలన్నీటినీ పుణికి పుచ్చుకున్న ఒకానొక తెలుగు బ్లాగు గురించే.. అదే శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారు రాస్తున్న 'హాస్య దర్బార్' బ్లాగ్!.ఎంతో క్లిష్టతరమైన మేనేజ్మెంట్ విషయాలను సరళమైన భాషలో విపులంగా వివరించటంలో, అవి కథల రూపంలో ఆసక్తికరంగా మలచటంలో రచయిత నేర్పు, సామర్ధ్యం మనల్ని అబ్బురపరుస్తుంది.
అంతేకాదు, ఇలాంటివి రాయడానికి పూనుకోవడం ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే కూడా.! ఎందుకంటే, బిజినెస్ పాఠాలైనా, మేనేజ్మెంట్ పాఠాలైనా టెక్స్ట్ పుస్తకాల్లో మాదిరి రాసేట్టయితే అందులో ప్రత్యేకతేముంటుంది.? చదువరులకు ఉల్లాసంగా కులాసా కబుర్లు చెప్పినంత సరదాగా మన తియ్యటి తెలుగులో మేనేజ్మెంట్ సూత్రాలు చెప్పడమే ఈ బ్లాగులో ఉన్న గొప్పదనం.
'కార్పొరేట్ కాశీ మజిలీ కథలు' అని సత్యప్రసాద్ గారు ఎంచుకున్న పేరు ఆయన కథలకి అతికినట్టుగా సరిపోతాయి. కాశీ మజిలీ కథలు చదువుతున్నంత హాయిగానూ అనిపిస్తుంది. గురు మామయ్య చెప్పే కార్పొరేట్ కాశీమజిలీ కథలు అల్లుడు వెంకటరత్నానికే కాదు.. చదివే ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఇందులోని ప్రతి రచన చక్కని తెలుగులో సులభ తరమైన శైలి లో సాగుతూ ఆపకుండా చదివిస్తాయి.
ఈ బ్లాగుని గురించి తెలియనివారికి ఇందులో ఏమున్నాయో చెప్పే ఒక చిన్న ప్రయత్నంగా..
ఏ ఉద్యోగం కావాలన్నా ఇంటర్వ్యూలకి హాజరవడం మొదటి ,కీలకమైన మెట్టు. దానికి సంబంధించి గురుమామయ్య చెప్పిన కిటుకులు ఇక్కడ చూడొచ్చు.
ఈ మధ్య కాలంలో మన ఆంధ్రదేశంలోనే కాక సాఫ్ట్వేర్ ప్రపంచంలో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిన సత్యం ఉదంతం గురించి గురుమామయ్య మాటల్లో ఇక్కడ చూడచ్చు.
ప్రపంచంలో ఎటు వైపు చూసినా కనిపిస్తున్న రెసెషన్ జపం, అగ్రరాజ్యం అమెరికా దివాళాకోరుతనం గురించి ఇక్కడ చూడచ్చు.
స్టాక్ మార్కెట్లు, షేర్లు అని వినడమే గానీ, వాటి గురించి పెద్దగా ఏమీ తెలీదనుకుంటే.. గురుమామయ్య చెప్పిన ఈ క్లాసుకు అటెండ్ అవ్వాల్సిందే మరి.!
ఇలాంటివే మరెన్నో వాణిజ్యపరమైన అంశాలైన ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వివిధ విషయాల గురించి విపులంగా చర్చించారు సత్యప్రసాద్ గారు ఈ 'హాస్యదర్బార్' బ్లాగులో.
అదీ, ఇది అని కాకుండా ఈ హాస్యదర్బార్లో వచ్చే ప్రతీ టపా ఉపయోగకరమైనదే కాబట్టి, అన్నిటినీ ముచ్చటగా ఒకే చోట భద్రపరచుకుని చదువుకోవాలనుకుంటే, తెలుగురత్న వారి సహకారంతో హాస్యదర్బార్ ఈ-బుక్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇందులో ఈ బ్లాగులోని కొన్ని వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. మిగతావాటిని కూడా ఈ-బుక్ రూపంలో అందించే దిశగా సత్యప్రసాద్ గారు ప్రయత్నిస్తున్నారు.
ఏతా వాతా మేం చెప్పొచ్చేదేమిటంటే అధ్యక్షా..! హాస్యదర్బార్ అని చెప్పబడేటువంటి ఈ ముచ్చటైన తెలుగు బ్లాగు మన బ్లాగ్జనులకు అత్యంత ఉపయోగకరంగా ఉందని, తెలియనివారు కూడా ఈ చక్కటి బ్లాగు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మేము తెలియజేస్తున్నమహో..! తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇంత చక్కటి బ్లాగుని వ్రాస్తున్నందులకు గానూ.. శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారికి అనేకానేక ధన్యవాదములు, అభినందనలు తెలుపుకుంటూ.. ఒక చిన్న కానుకగా ఈ లోగో ని అందజేస్తున్నాము..!
P.S: ఈ బ్లాగు గురించి మేమిక్కడ చెప్పిన అభిప్రాయాలు మరే బ్లాగుతోనూ పోల్చి గానీ, లెక్కగట్టి గానీ చెప్పలేదనీ, కేవలం ఈ బ్లాగుని గురించిన మా అభిప్రాయాలను నిర్దిష్టంగా తెలియపరిచామని మనవి.
మళ్లీ మరో చక్కటి బ్లాగుతోనో, పోస్టుతోనో.. మరోసారి మీ ముందుకి వస్తాం.. అందాకా సెలవ్.!
15 comments:
Very good!!! మంచి ప్రయత్నం, సుజ్జి మధుర మీ ఇద్దరికీ అభినందనలు
అంతే కాదండోయ్! పక్కవాళ్ళు చేసే మంచి పనిని గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించడం కూడా చాలా అరుదైన విషయమే! అందుకని మీక్కూడా మా చప్పట్లు. సత్యప్రసాద్ గారి రచన ఇటువంటీ గుర్తింపుకి అర్హమైనదే. అందుకని వారికీ చప్పట్లు.
మీ యజ్ఞాన్ని మున్ముందుగా ఓ మంచి బ్లాగుతో ప్రారంభించినందుకు అభినందనలు, ఇలానే కొనసాగించండి. లోగో కూడా బాగుంది. ఆ మధ్య మన బ్లాగ్మిత్రులు బ్లాగర్ల కోసం టీ షర్ట్సు తయారు చేసారు. ఈ లోగోలు కూడా వాటి మీద వేయవచ్చేమో!
Very good start.. Keep it up..
Very good effort. Keep it up.
Great WORK
I can only concur with what's said above. Nice attempt and wish you many more posts to bring contentment to both parties.
chaalaa chaala ba rasaru aripirala gari blog gurinchi...good work
బాగా రాసేరు. మొదటి ప్రయత్నం శుభారంభం. మంచి బ్లాగ్ గురించి చక్క గా వివరించారు. మీకు, సత్య ప్రసాద్ గారికి కూడా శుభాకాంక్షలు.
మధురవాణిగారూ,నిన్న మీ కామెంట్ చూసినప్పతి నుంచి మీ టపా చూడాలని చాలాసారు ప్రయత్నించి విఫలమయ్యాను.ఎందువల్లనో మీ 'మధురవాణీ" బ్లొగ్ ఓపెన్ అవ్వటం లేదు.ఆ జీవితం పోస్ట్ లింక్ నాకు అందించగలరు.లేదా బ్లాగ్లొ ఏదన్నా టెక్నికల్ పొరపాటు ఉన్నదేమో చూడండి.మీ మిగతా బ్లాగులన్ని ఓపెన్ అవుతున్నాయి ఇది తప్ప.
సుజ్జి,మధుర ఇద్దరికీ అభినందనలు ..చాలా బాగా రాసారు ..అరిపిరాల గారికి అభినందనలు :)
మంచి బ్లాగ్ గురించి చక్క గా వివరించారు. మీకు, సత్య ప్రసాద్ గారికి కూడా అభినందనలు.
Thanks
good very good ..
Thank you.
Post a Comment