ప్రశ్న: ఏంటీ సుజనమధురం.?
సమాధానం: బ్లాగు క్యాప్షన్ చూడొచ్చుగా ;)
ప్రశ్న: ఎందుకు?
సమాధానం: ఇదో ఆలోచనల కలబోత.!
ప్రశ్న: ఎవరి ఆలోచనలు?
సమాధానం: మావే.. (సుజ్జీ, మధుర)
ప్రశ్న: పరీక్ష (మీక్కాదు) అన్నారు. మరి ఎవరికి?
సమాధానం: అవును.. పరీక్ష మీక్కాదు. మాకే.! ఇన్నాళ్ళు హాయిగా నాలుగు కవితలు రాసుకుంటూ (సుజ్జీ), ఏవో పాటలు పాడుకుంటూ (మధుర) మా మానాన మేం ఉండేవాళ్ళం. మరిప్పుడేమో ఏదో పొడిచేద్దాం అని ఇద్దరం కలిసి ఒక బ్లాగ్ మొదలెట్టాం కదా.! ఇప్పుడు దాన్ని విజయవంతంగా, బ్లాగు జనులకు నచ్చేలా, అటు పనికొచ్చే సమాచారాన్ని అందిస్తూ, ఇటు కాలక్షేపానికన్నట్టూ, అన్నివిధాలా మెప్పించేట్టు రాయడం అంత సులువైన పని కాదుగా.! అందుకే.. పరీక్ష మీక్కాదు..మాకే ;)
ప్రశ్న: సరే.. అయితే ఏం చేయబోతున్నారు.?
సమాధానం: మేము ఇక్కడ చెప్పబోయే కబుర్లన్నీ మన బ్లాగ్లోకం చుట్టూనే తిరుగుతాయి. మన తెలుగు బ్లాగుల గురించి అందరికీ తెలిసిన మరియు తెలియని వివిధ కోణాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే, ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. మేము ఇక్కడ ప్రకటించే అభిప్రాయాలు, ఆలోచనలు మాకు మాత్రమే పరిమితమైనవి. ఎప్పుడు ఏ బ్లాగు గురించి ఏం చెప్తామన్నదానికి ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ లేవు. మా స్వేఛ్చానుసారం ప్రవర్తిస్తాము. అలాగే ఇక్కడ మేము చేయాలనుకునేది స్నేహపూర్వకమైన భావవ్యక్తీకరణ మాత్రమే.!
ప్రశ్న: అంటే ఏం చేస్తారు?
సమాధానం: అది తెలుసుకోవాలంటే.. వేచి చూడండి. వచ్చే టపా నుంచే మొదలు ;)
Monday, July 27, 2009
అందరికీ నచ్చేలా.. కొంచెం కొత్తగా..!
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
:) All the best Sujji and Madhura
All the best.
all the best sujana & madhura garu ....meenu
మెటా బ్లాగింగ్ లాంటిదన్నమాట మీరు చేయబోయేది. ఆసక్తిగా వుంది.
ఆసక్తిగా వుంది. ఎదురు చుస్తున్నా..
Hmm.
Nice begining.
It's a healthy sign.
మీ అందరి శుభాకాంక్షలు అందుకున్నాం :)
అందరికీ ధన్యవాదాలు. ఒక మంచి టపాతో మళ్ళీ త్వరలోనే మీ ముందుకొస్తాం.!
-- సుజ్జీ & మధుర
ఓ! ఇద్దరు కలిసి కంబైండు బ్లాగింగు అన్నమాట. All the best.
"ఎప్పుడు ఏ బ్లాగు గురించి ఏం చెప్తామన్నదానికి ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ లేవు. మా స్వేఛ్చానుసారం ప్రవర్తిస్తాము"--జాగ్రత్త సుమా!
All the best... :)
Waiting waiting wait....ing.....
All the best Sujji and Madhura.
still waiting.... :-0
@ సిరిసిరిమువ్వ గారూ,
అవునండీ..కంబైండు బ్లాగింగే.. ఎలా ఉంటుందో చూడాలి మరి :)
జాగ్రత్తగా ఉండమనే మీ సూచనకు ధన్యవాదాలు.
అందుకే కదండీ.. ఇలా కూడా చెప్పాము.
"మేము చేయాలనుకునేది స్నేహపూర్వకమైన భావవ్యక్తీకరణ మాత్రమే.!" అని ;)
@ శివ గారూ,
ధన్యవాదాలు.
@ ఉష గారూ, భావన గారూ,
ధన్యవాదాలండీ.! ఎదురు చూ..స్తూ ఉన్నారన్న మాట.!
వచ్చేస్తున్నామండీ.. ఇదిగో ఇంకాసేపట్లో మీ ముందుంటాం.. (అంటే.. మరి కొద్ది రోజుల్లో అన్నమాట ;)
All the Best... :)
Post a Comment